నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ ఎం ఎఫ్ సి) ద్వార సూర్యాపేట జిల్లా క్రైస్తవ నిరుద్యోగ యువతకు 2023-24 సంవత్సరమునకు గాను అర్హులైన క్రైస్తవ యువతీ యువకులకు డమసిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ఉచిత శిక్షణ కల్పించడం జరుగుతుందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పొందుటకు కావలసిన అర్హతలు ముస్లిం మతానికి చెందిన వారై ఉండాలి. కుల దృవీకరణ పత్రం బి సి (ఇ) మీసేవా ద్వార తహాసిల్దార్ జారీ చేసినది అయి ఉండాలి. పట్టణ ప్రాంతముల వారికీ ఆదాయం రూ. 2 లక్షల లోపు గ్రామీణ ప్రాంతాల వారికీ రూ.1.50 లక్షల ఆదాయము కలిగి ఉండి ఆదాయ దృవీకరణ పత్రం మీసేవా ద్వార తహాసిల్దార్ జారీ చేసి ఉండాలని తెలిపారు.అభ్యర్థుల వయసు 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి.ఆధార్ కార్డు కలిగియుండాలి. ఎస్ఎస్ సి ఇంటర్ పాసై ఉండాలి,ఆసక్తి కలిగిన వారు అర్హత సర్టిఫికెట్లతో దరఖాస్తు నింపి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ నెల 17 న అందజేయాలని పేర్కొన్నారు.