ప్రేమికుల రోజు కానుకగా సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌

ప్రేమికుల రోజు కానుకగా సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌అభిషేక్‌ పచ్చిపాల, నజియా ఖాన్‌, జబర్దస్త్‌ ఫణి, సతీష్‌ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘జస్ట్‌ ఎ మినిట్‌’. రెడ్‌ స్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కార్తీక్‌ ధర్మపురి ప్రెజెంట్స్‌ బ్యానర్లపై అర్షద్‌ తన్వీర్‌, డా. ప్రకాష్‌ ధర్మపురి ఈ చిత్రాన్ని పూర్ణస్‌ యశ్వంత్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్‌ని ప్రేమికుల రోజు కానుకగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్‌ యశ్వంత్‌ మాట్లాడుతూ, ‘గతంలో మేం రిలీజ్‌ చేసిన ఫస్ట్‌-లుక్‌కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్‌ కామెంట్స్‌ ఇస్తూ, డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్‌ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిచ్చింది. అతి త్వరలో ట్రైలర్‌ని కూడా రిలీజ్‌ చేయబోతున్నాం. ట్రైలర్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ రివీల్‌ అవుతాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్‌ ఈ సాంగ్‌ పాడడం సాంగ్‌కి చాలా ప్లస్‌ అయ్యింది. రాంబాబు గోశాల సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుంది’ అని చెప్పారు.
‘మా చిత్ర ఫస్ట్‌-లుక్‌, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా సినిమా పైన ఉండాలని, సినిమాను మంచి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు తెలిపారు.ఇషిత, వినీషా, కుషి భట్‌, నాగిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన – దర్శకత్వం : అర్షద్‌ తన్వీర్‌, డిఓపి : అమీర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : శేఖర్‌ ఇప్పకాయల, ఎడిటర్‌ : దుర్గ నరసింహ, మ్యూజిక్‌ : యస్‌. కె భాజీ.