డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్‌ ఎత్తివేత

డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్‌ ఎత్తివేత– యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ప్రకటన
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌కు శుభవార్త. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై గత ఏడాది ఆగస్టు 23న విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తి వేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న సమావేశమైన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ బ్యూరో సస్పెన్షన్‌పై కీలకం నిర్ణయం తీసుకుంది.
జులై 1, 2024 లోపు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని, మాజీ అధ్యక్షుడి లైంగిక వేధింపులపై నిరసన గళం ఎత్తిన రెజ్లర్లపై సెలక్షన్‌ ట్రయల్స్‌లో ఎటువంటి వివక్ష చూపించకూడదని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ బ్యూరో ఆదేశించింది. సస్పెన్షన్‌ ఎత్తివేతతో భారత కుస్తీ క్రీడాకారులు ఇక నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో మువ్వెన్నల జెండాతో బరిలోకి దిగనున్నారు.