పోలీసు నియమాక మేళా

– నేడు సీఎం చేతులమీదుగా పత్రాల అందచేత
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కొత్తగా ఎంపిక కాబడిన కానిస్టేబుళ్లతో పాటు ఆర్టీఏ కానిస్టేబుల్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌కు చెందిన ఫైర్‌మెన్‌లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నియమాక పత్రాలను అందజేయనున్నారు. ఎల్బీస్టేడియంలో జరిగే ఈ నియమాక ఉత్సవంలో మొత్తం 15,750 మందికి సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్పీ, పీటీవో, ఎస్పీఎఫ్‌, ఐటీ కానిస్టేబుళ్లతో పాటు రవాణా, ఫైర్‌ సర్వీసులకు చెందిన కానిస్టేబుళ్లకు నియమాక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగం ఎల్బీస్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా స్టాల్స్‌ వారీగా కానిస్టేబుళ్లను విభజించి ప్రణాళికబద్ధంగా నియమాక పత్రాలను అందజేసేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జితేందర్‌తో సహా పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొంటున్నారు. ఉదయం 9గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు.