– మణిపూర్ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవనం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని బీరెన్ సింగ్ చెప్పుకున్నారు. కాగా, మణిపూర్‌లో గత ఆరు నెలలు నుంచి కొనసాగుతున్న హింసాకాండకు అక్రమ వలసదారులు ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు కారణమని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం.. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది అని ప్రకటించారు. ప్రస్తుతతరం అభద్రతాభావంతో ఉందని, ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు అని బీరెన్‌సింగ్ అన్నారు.