తండ్రీకొడుకుల భావోద్వేగభరిత ప్రయాణం

తండ్రీకొడుకుల భావోద్వేగభరిత ప్రయాణంస్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌ పై ప్రభాకర్‌ ఆరిపాక సమర్పణలో పథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. నటుడు ధనరాజ్‌ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్‌ను హీరో రామ్‌ పోతినేని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేసి సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దర్శకుడు హరీష్‌ శంకర్‌ మీడియా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసిన అనంతరం మాట్లాడుతూ,’ధనరాజ్‌ ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎమోషనల్‌ జర్నీతో తండ్రీి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లింప్స్‌ కొత్తగా ఉంది’ అని అన్నారు. మోక్ష, హరీష్‌ ఉత్తమన్‌, సత్య, పద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్‌ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు.