– పంజాగుట్ట ప్రధాన రహదారిపై కారులో సాంకేతిక లోపం
నవతెలంగాణ – బంజారాహిల్స్
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట ప్రధాన రహ దారిపై ఖైరతాబాద్ వైపు నుంచి అమీర్ పేట్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారి గా మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలో కారు మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు. అయితే, కారు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.