
మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయితీలో ఆవరణలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ప్రత్యేక పారిశుద్ధ్య ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మైలారం గంగాధర్ అధ్యక్షతన ఈ గ్రామ సభను నిర్వహించారు. సభలో గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి గ్రామసభకు హాజరైన ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. యువత మద్యపానం,మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సక్రమైన మార్గం లో నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణ అధికారిని పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, లైన్ మెన్ సురేష్, నాయకులు. గణేష్, దేవేందర్, శ్రీనివాస్, సుమన్, ముత్తెన్న, నారాయణ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.