– ఔటాన్ ప్రకారం ధర చెల్లించాలి
– రైతులకు న్యాయం చేస్తాము : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
వేరుశనగ పంట విక్రయించడానికి వచ్చిన రైతులకు మార్కెట్ యార్డ్ ఆవరణలో భోజనం ఏర్పాటు చేస్తామని, రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం మార్కెట్ యార్డ్ లో సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతుల అభిప్రాయం మేరకు ఔటాన్ తీసిన తర్వాత గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. 15 రోజుల లోపు రైతులకు డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక క్వింటాలు పలుకు రూ .15000 కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, కాశన్న యాదవ్, రాజేందర్ అడ్వకేట్ , తదితరులు ఉన్నారు.