ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం..

– పేటలో ఘనంగా కామ్రేడ్ ధర్మబిక్షం102 వ జయంతి
– విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ధర్మభిక్షం జీవిత పుస్తకం లోని ప్రతి పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.  కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 102 వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ నవాబుపై ప్రజాసైన్యంతో తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబు పాలన కింద ఉన్న సూర్యాపేటలో విద్యార్థులకు హాస్టల్ పెట్టి వారికి విద్యాబుద్ధులతో పాటు సామాజిక చైతన్యాన్ని నేర్పించాడన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఘనత ఆయనదే అన్నారు.  గీత పనివారల కార్మికుల సమైక్యతను స్థాపించి స్వచ్ఛమైన ప్రకృతి పానీయమైన కల్లును ఆహార పానీయమని,  విటమిన్లు పోషకపదార్థాలు కలిగిన కల్లును రక్షించుకోవాలని ఆయన చేసిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ ఎమ్మెల్ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, గీత పనివారాల రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు,ఎఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్  మట్టపల్లి సైదులు,ఖమ్మంపాటి రాము, దీ కొండ శ్రీనివాస్, రేగటి లింగయ్య, బూర రాములు, పోలగని రవి గోపగాని రవి వాడపల్లి గోపి వాడపల్లి ప్రభాకర్తదితరులు పాల్గొన్నారు.