
లంబాడా-గిరిజనుల ఆరాధ్య దైవమైన “శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని గురువారం పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ మంథని నియోజకవర్గ గిరిజన ప్రజలందరికీ గురువారం (భోగ్ బండారో) శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే లంబాడా-గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు దక్కడం జరిగిందన్నారు.మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే “శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్” జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు.వారి సంక్షేమం కోసం అనేక నిధులను కూడా కేటాయించడం జరిగిందన్నారు.