సెంథిల్‌కు భార్యావియోగం

సెంథిల్‌కు భార్యావియోగంసినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌కుమార్‌ ఇంట విషాదం నెల కొంది. ఆయన సతీమణి, యోగా టీచర్‌ రూహి మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. 2009లో రూహిని సెంథిల్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు సెంథిల్‌ సినిమాటోగ్రఫీ అందించారు.