ఎన్నికల బాండ్ల జారీ రాజ్యాంగ విరుద్దమని ప్రధాన న్యాయ మూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవారు, జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురి ధర్మా సనం చారిత్రాత్మక ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు న్యాయ స్థానాల మీద నమ్మకాన్ని పెంచేదిగా ఉంది. బాండ్ల కొనుగోలుకు సంబంధిం చిన వివరాలన్నీ అందించాలని వాటిని జారీచేసిన ఎస్‌బిఐ, వెబ్‌సైట్ లో వివరాలు ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును వమ్ము చేసేందుకు కేంద్రం మార్గాలు వెతు కుతుందా, లేదా మరింత విస్తృత ధర్మాసనం విచారణ కోరాలని నిర్ణ యిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. పారదర్శకత, విలువలు, వలు వలు, ఆదర్శాలంటూ కబుర్లు చెప్పే బీజేపీ, బాండ్లను అందుకున్న ఇత ర పార్టీలకు ఈ తీర్పు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ అని చెప్పవచ్చు. కార్పొరేట్ల విరాళాలను స్వీకరించకూడదని నిర్ణయించిన సీపీఐ(ఎం) రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దానిలో భా గంగానే ఈ పథకాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ, స్వచ్చంద సంస్థలైన ఎడిఆర్, కామన్ కాజ్ దాఖలు చేసిన పిటీషన్లపై నవంబరు రెండున రిజర్వు చేసిన తీర్పును గురువారం నాడు కోర్టు వెల్లడించింది.
బాండ్ల జారీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ఏ ప్రకారం రా జ్యాంగవిరుద్దమని, తక్షణమే నిలిపివేయాలని, ఏ తేదీన ఎవరు ఎన్ని బాండ్లు కొనుగోలు చేసిందీ, ఏ పార్టీకి చెల్లించిందీ మార్చి ఆరవ తేదీ లోగా బాండ్లను పొందిన పార్టీల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బిఐని కోర్టు ఆదే శించింది. బాంకు ఇచ్చిన సమా చారాన్ని మార్చి 13వ తేదీనాటికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచాలని, ఇప్పటివరకు ఏ పార్టీ అయినా నిధులను స్వీకరించకపో తే జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేసిన వారికి తిరిగి ఇచ్చివే యాలని కూ డా తీర్పులో పేర్కొన్నది. ఈ అంశంపై ఇ లాంటి తీర్పు వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సరిగ్గా ఎన్నికల ముం దు వచ్చిన దీన్ని అమలు జరపటం తప్ప మరొక మార్గం లేదు. అలా గాక అమలు గాకుండా ఎవరైనా చట్టాలలో ఉన్న లోపాలను ఉపయోగించుకోవాలని చూస్తే వారు జనంలో గబ్బు పట్టటం ఖాయం. వర్తమానంలో నీకది నాకిది అంటూ అధికారంలో ఉన్న పార్టీల పెద్ద లు, కార్పొరేట్ సంస్థలు ప్రజల సంపదలను కొల్లగొట్టటం ఇటీవలి కాలంలో విచ్చలవిడిగా సాగుతోంది. ఈ అవినీతిని చట్టబద్దం చేసేం దుకు కార్పొరేట్లను కాపాడేందుకు తీసుకువచ్చిందే ఈ పథకం. ఇప్ప టివరకు జారీచేసిన బాండ్లలో 94శాతం కోటి రూపాయలవే ఉన్నా యంటే సామాన్యులు వీటిని పార్టీలకు ఇచ్చారంటే జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టటం తప్ప మరొకటి కాదు. జారీ చేసిన బాండ్ల వివరాలను వెల్లడిస్తే కొనుగోలు చేసిన వారి గోప్యతకు భంగం కలి గించినట్లవుతుందంటూ కేంద్ర ప్రభుత్వం దివాలాకోరు వాదనను విని పించింది. నల్ల ధనాన్ని నిరోధించేందుకు తీసు కున్న చర్య అంటూ సమర్ధించుకుంది.
బాండ్ల కొనుగోలు స్వచ్చందమే అయితే పేర్లు బయటకు రావటానికి కొన్నవారికి ఎలాం టి ఇబ్బంది ఉండనవసరం లేదు. ఏ సంస్థ ఎన్ని బాండ్లు కొనుగోలు చేసిందీ కావాలంటే కంపెనీల ఖాతాపుస్తకాలు బహిరంగమే గనుక తెలుసు కోవచ్చని మరొక పసలేని వాదన కోర్టు ముందుకు వచ్చింది. అలాంటపుడు ఏ కంపెనీ అయినా ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద కోరితే వివ రాలివ్వటానికి వచ్చిన ఇబ్బందేమిటి? దేశంలో 23లక్షల నమోదైన కంపెనీలు ఉన్నాయని, వాటన్నింటి నుంచి వివరాలు తీసుకోవటం సామాన్యులకు, ఎవరికైనా కుదిరేపనేనా అని పిటీషనర్ల తర ఫున వాదించి అడ్వకేట్ ప్రశాంతభూషణ్ వాదన ఎంత సుము చితమైనదో కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ పథకం అధికారం లో ఏ పార్టీ ఉంటే దానికి అనుకూలంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు విరాళమిస్తే వారి వివరాలు కనుక్కొని వారిని వేధించటానికి, తమకు అనుకూ లంగా సమర్పించుకున్నవారికి అవసరమైన అనుమతులు, విధానపరమైన మార్పులు చేసేందుకు అవకాశముందన్నది కూడా అందరికీ తెలిసిందే. ఒక కంపెనీ ఎవరికి విరాళమి చ్చేది నిర్ణయించేది కంపెనీ సారధులు తప్ప వాటాదార్ల నిర్ణ యంతో పని ఉండదని, వారి పట్ల కంపెనీ బాధ్యతను ఉల్లం ఘించినట్లు అవుతుందని, ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వా లన్నది యజమానులు ఎలా నిర్ణయిస్తారని మరో న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వాదన ఎంతో సముచితమైనదే. రాజ కీయ పార్టీలకు విరాళాలు ఇవ్వటంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశం కూడా ఇమిడి ఉంటుందని తెలిసిందే. అలాంట పుడు సమాచార హక్కు కింద ఓటర్లందరికీ తెలుసుకొనే హక్కు ఉం టుంది. ఒకవైపు కార్పొరేట్ల నుంచి విరాళాలు స్వీకరించే పార్టీలు వాటి కి అనుకూలంగా వ్యహరిస్తాయే తప్ప జనాల జేబులను కొల్లగొట్ట టాన్ని నిరోధించలేవు.దేశ న్యాయవ్యవస్థలో ఒక చారిత్రాత్మక అంశం గా సుప్రీంకోర్టు మిగిలిపోతుందని వేరే చెప్పనవసరం లేదు.