సాహిత్య చరిత్ర వెనుకబడిన తరగతులదే..

Literary history belongs to backward classes..– సాహిత్య విమర్శకు పరిశోధనే ప్రాణం
– శ్రీనివాస్‌తో ముఖాముఖి కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌
విస్తృత సాహిత్య చరిత్ర అంతా వెనుకబడిన దళిత, మైనారిటీ, బీసీ తరగ తులదేనని, ఇందుకోసం కొత్త చరిత్ర రచనకు పరిశోధనలు కొనసాగిస్తు న్నామని చరిత్ర పరిశోధకుడు శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ వేదికపై ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య అధ్యక్షత ప్రముఖ సాహితీ విమర్శ కుడు శ్రీనివాస్‌తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాహిత్య విమర్శకు పరిశోధన ప్రాణమని, పరిశోధనల లోతు తెలియకపోతే సమర్థవంతమైన విమర్శ బయటకు రాదని తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సాహిత్యాన్ని తెలంగాణ సాహితీవేత్తలే వెలుగులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. త్వరలో బీసీ సాహిత్య చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్‌, ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వర్‌, ప్రముఖ కవి ఉడారి నారాయణ, గుడిపల్లి నిరంజన్‌, రాపోలు సుదర్శన్‌ పాల్గొన్నారు.