నవతెలంగాణ – అచ్చంపేట
దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని , వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.25000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ ముందు వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు. భారతదేశంలో కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం అర్షించదగ్గ విషయమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సమ్మెలో పాల్గొనడానికి వస్తే మోడీ ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తూ రైతులపై బాష్ప వాయువు ప్రయోగిస్తున్నారని అన్నారు. అన్యాయం జరుగుతుందని నిరసన చేయడానికి కూడా దేశంలో అవకాశాలు లేకుండా మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా నిర్మాణ, సేవా రంగానిది అయితే పారిశ్రామిక రంగానిది 30శాతం పైనే ఉంటుంది.ఈ రెండు ప్రధాన రంగాలలో అభివృద్ధి సాధించాలంటే కార్మికులే కీలకము కానీ అసంఘటితంగా ఉన్న 96% కార్మికులంతా అత్యంత తక్కువ వేతనంతో దుర్భరమైన జీవితాలు జరుపుతున్నారని అన్నారు. దేశంలో ఎంఎస్ స్వామినాథన్ ప్రతిపాదించిన సంస్కరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి ఎల్ దేశ నాయక్ , అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కార్యదర్శి పార్వతమ్మ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, ఐద్వా నాయకురాలు నిర్మల, డిఐఎఫ్ఐ జిల్లా నాయకులు సైదులు, అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వివిధ రంగాల అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.