నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామలో ప్రభుత్వ హై స్కూల్ ముందు గ్రామ రైతుల అవసరాల కొరకు ఏర్పాటుచేసిన నీటి హౌస్ చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలతో పాచి నిండి దర్శనమిస్తున్నాయి. నిల్వ ఉన్న నీటి సంపులో దోమలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని సాయంత్రం రాత్రివేళలో ఇంటి నివాసాలు పక్కనే ఉండడంతో దోమ కాటుకు గురై మలేరియా టైఫాయిడ్ డెంగి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఇటీవల గ్రామ సర్పంచులు పదవి కాలం ముగించగా గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఆదేశాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రశిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు సందర్భంగా మురికివాడలు, వీధి వాడలో పర్యటించి మర్లపడ్డ నీటి సంపులను నీటిని తొలగించి పరిశుభ్రంగా శానిటేషన్ నిర్వహించాలన్న పంచాయితీ అధికారులు, పాలకుల ఆదేశాలు బేకతారు చేస్తు గ్రామపంచాయతీ కార్యదర్శులు పనితీరు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉన్నట్లు ఈ చిత్రంలోని నీటి హౌస్ ను చూస్తేనే ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారనేది తెలుస్తోంది. కార్యదర్శుల స్పెషల్ ఆఫీసర్ల తీరు రానున్న రోజులలో మెరుగు పడేనా అన్ని ప్రశ్నార్థకంగా మారింది.