వరిలో సస్యరక్షణ చర్యల గురించి అవగాహన సదస్సు

నవతెలంగాణ- శంకరపట్నం
వరిలో సస్యరక్షణ చర్యల గురించి అవగాహన సదస్సు శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్, కాచాపూర్, క్లస్టర్  రైతు వేదికలో రైతులకు పంటలకు వచ్చే తెగుళ్ల చర్యల గురించి వ్యవసాయ అధికారి ఆర్ శ్రీనివాస్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, వరి మొగి పురుగు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు, వేరు కుళ్ళు తెగులు,పై రైతులకు అవగాహన కల్పించారు. వరిలో ఉదృతి నివారణకు జిలా క్లోరాంట్ర నిలిప్రోల్ 500ఎంల్ ఎకరానికి అగ్గితెగులు నివారణకు ఐసోపోద్రియోలీను 250ఎంల్ ఎకరానికి  పిచికరి చేసుకోవాలని వివరించారు. అలాగే పాముపొడ తెగులు నివారణకు హెక్సా కొనాజల్ 500ఎంల్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అలాగే 20-20-0-13 కాంప్లెక్స్ ఎరువులను వరిలో చల్లుకోవడం వలన వేరుకుళ్ళు, సోకే ప్రమాదం ఉందన్నారు.కావున రైతులు యూరియా ఎరువులను ఒక ఎకరానికి 25 కేజీలు,ఫొటోస్ 25 కేజీలను చివరి దశలో చల్లుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు ఎస్ సునంద,పి రాజ్ కుమార్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.