ఆయిల్ ఫాం సాగు ఔత్సాహికులకు సువర్ణావకాశం

– పట్టా లేని రైతులకు రాయితీ పై మొక్కలు పంపిణీ
– ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారే…
– ఆయిల్ఫెడ్ డి.ఒ బాల క్రిష్ణ   
నవతెలంగాణ – అశ్వారావుపేట
సాగు భూమి ఉండి,పట్టాలు లేని ఆయిల్ ఫాం సాగు చేయాలనే ఔత్సాహికులు అయిన రైతులకు రాయితీ పై మొక్కలు పంపిణీ చేయాలనే నిర్ణయం చేసి తెలంగాణ వ్యవసాయ శాఖ,ఆయిల్ఫెడ్ సువర్ణావకాశం కల్పించింది.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి ఉండి,సాగు చేయాలనే ప్రతీ రైతుకి రాయితీ మొక్కలు అందజేయాలని ఆయిల్ఫెడ్ ఎం.డి సురేందర్,జి.ఎం సుధాకర్ రెడ్డిని ఆదేశించారు.ఈ మేరకు రాయితీ మొక్కలు పంపిణీ కీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారులు స్థానిక ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి బాల క్రిష్ణ కు సూచించారు.దీంతో కొత్త పాస్ బుక్ లేకుండా సాగు చేసే భూమి కలిగి ఉన్న రైతులకు పాత ల్యాండ్ రికార్డ్స్  పై సబ్సిడీ రేటుకే పామాయిల్ మొక్కలు పంపిణీ ఏర్పాట్లు చేసారు.ఈ పంపిణీ ని స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ శనివారం ప్రారంభిస్తారని ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి బాల క్రిష్ణ శుక్రవారం తెలిపారు.ఈ సదావకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.