నవతెలంగాణ – హలియా
కార్మికుల సంక్షేమ చట్టాల సవరణ చేసి కార్మికుల కడుపులు కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోన్ రెడ్డి నాగిరెడ్డి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు ఆవేదన వ్యక్తపరిచారు.శుక్రవారం హాలియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నరేంద్ర మోడీ ఏంసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల సంక్షేమాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిత్యవసరాలు వస్తువృద్ధులను వెంటనే తగ్గించాలని విద్యుత్ సౌరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలని ఉపాదామీ పథకాన్ని పరిరక్షించి దినుసర్వేత్తము ఎనిమిది వందల రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని అన్నారు.దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు సుమారు 80 లక్షల కోట్లు అప్పు ఉంటే నేడు డబల్ అయిందని ఆవేదన వ్యక్తపరిచారు. కార్పొరేట్ సంస్థలకు పారుబకాయిల కింద లక్షల కోర్టు రైతులు కల్పిస్తున్నారని ఎట్టి చేస్తున్న కార్మికులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేయక పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్కే బషీర్, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్, రమేష్ , చిలుముల దుర్గయ్య, రేబెల్లి వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, సుధాకర్, కేతపల్లి సైదులు, యాదయ్య, ఏసుబ్, జానిమియా, కట్నం వెంకటయ్య, సైదుసేన్, సుధాకర్, రవి నాయక్, పరుశు, శంకర్, జాను తదితరులున్నారు