
నూతనంగా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికై మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద, డిచ్ పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు శ్రేణులు, మహిళలు బోనాలతో,డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి పుల మాలలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్, డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, సంతోష్ రెడ్డి,బోర్ వెల్ రాజేందర్ రెడ్డి,కర్స మోహన్, శ్యాం సన్, కంచెట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా, దర్మగౌడ్, వాసు బాబు,ఎల్ ఐ సి గంగాధర్, జమీల్ పాషా, ఆశిష్, హబిబ్, ప్రవీణ్ గౌడ్ తోపాటు పార్టీ నాయకులు శ్రేయోభిలాషులు జిల్లా నలుమూలల నుండి పాల్గొని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.