
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం జాతరకు సందర్శకులు ముందస్తుగానే ముక్కులు చెల్లించుకోవడం కోసం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. నెలరోజుల ముందు నుండి భక్తులు తండోపతండలుగా కదులు వచ్చి వన దేవతలను దర్శించుకుని వెళ్తున్నారు. అందులో భాగంగా గురువారం కూడా మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.వన దేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాతర సమీపిస్తున్న భక్తుల తాకిడి అధికమవుతోంది. మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల సమూహాలు, వాహనాలే కనిపిస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వనదేవతల దర్శనాలకు వచ్చిన భక్తులందరూ జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి చిన్నారులకు పుట్టు వెంట్రుకలు సమర్పిస్తున్నారు. మొక్కలు ఉన్న మహిళలు లు పురుషులు తమ తలనీలాలు సమర్పించుకుంటారు. మేడారం అంతా భక్తులు వాహనాల సందడి కనిపించింది. వన దేవతల గద్దెల వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. పరిస్థితిని గమనించిన అధికారులు గద్దెలకు తాళాలు వేశారు. వచ్చిన భక్తులందరినీ క్యూలైన్ల ద్వారానే అనుమతించారు. ఎత్తు బెల్లం, ఒడి బియ్యం, పసుపు కుంకుమ, పూలు పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు భక్తుల కానుకలు దేవతలకు సమర్పించే బోర్డు పెట్టారు పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించి బంగారాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని కృతనిశ్చయంతో వెనుతిరిగి వెళ్తున్నారు. వనదేవతల దర్శనం ముగించుకొని విడిది చేసేందుకు కు పసర రోడ్డు మీదుగా నార్లపూర్ చింతల్, తాడ్వాయి రోడ్డు మీదుగా గుంపులు గుంపులుగా అడవులలో చెట్ల క్రింద వన భోజనాలు చేస్తున్నారు.



