అక్రమంగా ఇసుక రవాణా చెస్తే చర్యలు తప్పవు: సీఐ ఎర్రల కిరణ్‌

నవతెలంగాణ – కోహెడ
అక్రమంగా ఇసుక రవాణా చెస్తే చర్యలు తప్పవని హుస్నాబాద్‌ సీఐ ఎర్రల కిరణ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మోయతుమ్మెద వాగు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాలుగు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న వాహనాలను నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కమీషనర్‌ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన ట్రాక్టర్‌ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్‌లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. యువత పేకాట, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైన అనుమానితులుగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట ఎస్సై సిహెచ్‌. తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్‌ కనకయ్య, కానిస్టేబుల్‌ భూక్య రమేష్‌, తదితరులు ఉన్నారు.