ఢిల్లీలో రైతులు సకల సంసిద్ధతతో, తిను బండారాలతో, వేలా ది ట్రాక్టర్లతో కథం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. వారిని నిలువరించేందుకు గతంలో భంగపడ్డ బీజేపీ ప్రభుత్వం… సిమెంట్ దిమ్మెలతో, ఇనుప కంచెలతో అనేక చోట్ల బారికెడ్లు నిర్మించింది. వాహ నాలు రాకుండా కందకాలు తవ్వింది.ఇనుప చువ్వలు రోడ్డుపై నాటింది. ఇంటర్నెట్‌ను బంద్ చేసింది.144 సెక్షన్‌ను నెల రోజు లపాటు విధించింది. లాఠీ చార్జీలతో, వాటర్ క్యాన్లతో, భాష్ప వాయుగోళాలతో, రబ్బర్ బుల్లెట్లతో, డ్రోన్‌ల టెక్నాలజీతో, అధు నాతన సాంకేతిక ఆయు ధాలతో రైతుల పీచమణచడానికి, వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి సీఆర్పీ పోలీసు బలగాలు ఎక్కడికక్కడ ప్రయత్నించింది. అయితే వీరంతా పాకిస్తాన్ తీవ్ర వాదులో, ఖలిస్తాన్ ఏజెంట్లో కాదు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైెతు లు. వారు చేసిన నేరమేంటి? కేంద్రం ఎందుకు వీరిని అణగదొక్కా లని చూస్తోంది? పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని అడగ డమే వారి నేరం. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు యధాత దంగా అమలు చేయాలని, రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయడం కోరడం. రైతులకు, వ్యవసాయ కార్మికులకు పింఛను మం జూరు చేయమని విన్నవించడం, ‘లఖింపూర’ బాధితులకు న్యాయం చేయాలని, రైతులపై అక్రమంగా బనాయించిన కేసులు ఉపసం హరించాలని డిమాండ్ చేయడం. ఇవి మోడీ ప్రభుత్వం దృష్టిలో నేరాలు. కానీ ఇవి రైతుల కనీస డిమాండ్లు.
మూడేండ్ల కిందట జరిగిన ఢిల్లీలో రైతుల మహా పోరాటం గుర్తుండే ఉంటుంది కదా. రాత్రనకా, పగలనకా, ఎండనకా, వాన నకా చేసిన ద్యెమం. రైతు సమస్యల పరిష్కరించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ పోరాటం చరిత్రలో లిఖించదగినది. ఈఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయారు. ఏడాది పాటు చేసిన ఈ ఉద్యమానికి చివరకు మోడీ ప్రభుత్వం తలవంచింది. చివరకు ఆ మూడు రైతు వ్యతిరేక నల్లచ ట్టాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని పార్లమెంట్ నిండుసభలో ప్రకటించాడు. రైతులకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పాడు. రైతు డిమాండ్లు నెరవేరుస్తామని హామీనిచ్చాడు. ఉద్యమంలో చని పోయిన రైతులకు కనీసం ఇప్పటికీ నష్టపరిహారం కూడా చెల్లిం చలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.ఇప్పుడు రైౖతుల పట్ల ప్రేమ ఉందని చాటుకోవడానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… మాజీ ప్రధాని చౌదరీచరణ్ సింగ్‌కు, ప్రజల ఆహార కొరత తీర్చిన, రైతు బాంధవుడు శాస్త్రవేత్త స్వామి నాథన్‌కు దేశంలో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. వీరిదంతా ఓట్ల రాజకీయమని తేలి పోయింది. అయితే ఆల యాలను కటించడం, నాయకులకు భారీ విగ్రహాలను ప్రతిష్టించ టం, పురస్కారాలతో సరిపుచ్చటంతో అంతా అయిపోయిందా? వా రి ఆశయాలను, వారి హిత వాఖ్యలను, చేసిన విలువైన సూచనల ను అమలు చేయకుండా తుంగలోకి తొక్కి, ఈ హంగామాలు ఎందుకు?
అయితే రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు నెర వేర్చాలని డిమాండ్ చేస్తూ మళ్లీ రైతు ఉద్యమం ప్రారంభమైంది. ఓవైపు చర్చల పేరుతో రైతు సంఘాలను పిలుస్తూనే మరోవైపు వా రి పోరాటాన్ని అణిచేందుకు మోడీ ప్రభుత్వం పూనుకోవడం ఎంత మాత్రం సరికాదు. అయినా రైతులు ఎక్కడా వెనుకంజ వేయటం లేదు. పంజాబ్, హర్యానా నలమూలల నుంచి రైతులు ఢిల్లీ నగర ప్రవేశానికి తండోపతంతండాలుగా భారీ సంఖ్యలో తరలివస్తున్నా రు. గతంలో రైతాంగ ఉద్యమ చరిత్రలో ఏడాదిపాటు బీజేపీ ప్రభు త్వంతో పోరాడి ఘన చరిత్ర సృష్టించారు. ఆ అనుభవంతో, ద్విగుణీ కృత ఉత్సాహంతో కథం తొక్కుతున్నారు.మొత్తానికి అక్కడ ఇరుప క్షాల మోహరింపులు చూస్తూ ఉంటే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామవర్ణన సన్నివేశాలను తలపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.2020-21లో ఢిల్లీలో కనపడిన దృశ్యాలే మళ్ళీ పునరావృతమవుతున్నాయి.
ప్రజలను ఇంకెంత కాలం ఈ గారడీ చేష్టలతో మభ్యపెడుతాడు మోడీ? దేశప్రజలకు ఆరుగాలాలు కష్టించి అన్నం పెట్టే రైతులకే సు న్నం పెడతారా? ఈ కక్ష సాధింపులేమిటి? వారిపై పోలిసులు అక్ర మంగా బనాయించిన కేసులను ఎత్తివేయరా? వారిపై యుద్ధ ప్రక టించినట్లు ఈ దాడులేమిటి? పాకిస్తాన్ సరిహద్దులో కూడా ఈ బారికేడ్లు, సైనిక, పోలీసుల మోహరింపులు లేవు.అలా చేసినా వారి ఆక్రమిత భూభాగంలో కొంతైనా దక్కేది. రైతుల ఓట్లతో గెలిచి వారినే శత్రువులుగా చూస్తారా? బ్యాంకులను దోచి విదేశాలకు పారి పోయిన గుజరాతీ నేరస్తుల ముఠాకు రుణాలను మాఫీ చేస్తే లేని కష్టం, రైతుల రుణాలకు మాఫీ చేస్తేనే వచ్చిందా? ప్రతి ఏటా రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు వ్యధలను తీర్చలేరా? కౌలు రైతుల సమస్యలు పరిష్కరించరా? భూసంస్కరణలు, వ్యవ సాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడంలో వస్తున్న ఇబ్బందు లేంటి? పొలాలకు నీటి వసతి కల్పించటం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు అమ్మకుండా నిషేధించడం వంటి డిమాండ్లు నేరవేర్చ లేనివా? గ్రామీణభివృద్ధిని ఏర్పాటు చేసి, పంటల బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతులకు నాలుగు శాతం సరళ వడ్డీతో రుణాలందించడం వంటి అనేక సిఫారసులు కూడా స్వామి నాథన్ కమిషన్ సిఫారసు చేసిన అంశాలే.వీటిలో ఏ ఒక్కటీ ఈ పదేండ్లలో మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక ప్రభుత్వం ఉం డెందుకు? ఇంత తిరుగులేని మెజారిటీ ఉండి ఏమి సాధించినట్లు? రేపు నాలుగు వందల సీట్లు సాధిస్తా అంటున్నారు? ఇంతకన్నా పెద్ద గా ఉద్దరించేదేముంది? ఇప్పటికైనా రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. ఈ దేశ ప్రజలు విజ్ఞత గలవారన్న విషయం మరవ కూడదు. సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు.
– డా.కోలాహలం రామ్ కిశోర్, 9849328496