మా పిటీషన్‌ను అత్యవసరంగా విచారించండి

– సుప్రీంకోర్టును కోరిన శరద్‌పవార్‌
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాలని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపకులు శరద్‌పవార్‌ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎన్‌సీపీ పేరు, గుర్తును అజిత్‌పవార్‌ గ్రూపునకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12న సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాలని, వీలైయితే సోమవారం నుంచి విచారణ ప్రారంభించాలని శుక్రవారం మరోసారి అభ్యర్థించారు. శరద్‌పవార్‌ అభ్యర్థనను పరిశీలిస్తామని సీజేఐ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం హామీ ఇచ్చింది.