నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండ లంలో గొర్రెలు, గేదెలను జాతీయ రహదారిపై నిలిపి వినూత్నంగా గ్రామీణ బంద్ నిర్వహించారు. శుక్రవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ పిలుపులో భాగం గా కారేపల్లి ప్రధాన వీధుల్లో అఖిల పక్షం నాయకులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో గొర్రెలు, గేదెలను నిలిపి నిరసన తెలిపారు. రైతు, కూలీలు, కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ విధానాలను వ్యతిరేకిం చాలని నినదించారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కారేపల్లి క్రాస్ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభధ్రం, నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, కే.నరేంద్ర, వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంబరం, పాసిన్ని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.