గో ఫస్ట్‌పై స్పైస్‌జెట్‌ దృష్టి కొనుగోలుకు బిడ్డింగ్‌

గో ఫస్ట్‌పై స్పైస్‌జెట్‌ దృష్టి కొనుగోలుకు బిడ్డింగ్‌న్యూఢిల్లీ : దివాలా తీసిన గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌ అజరు సింగ్‌ ఆసక్తి చూపుతున్నారు. గో ఫస్ట్‌ను కొనుగోలు చేసేందుకు ఆయన బిడ్‌ దాఖలు చేశారు. ఇది సాధించుకోగలిగితే స్పైస్‌ జెట్‌ ఆపరేషన్స్‌కు సాయం అవుతుందని అజరు సింగ్‌ పేర్కొన్నారు. తన వ్యక్తిగత సామర్థ్యం ఆధారమే బిడ్‌ వేశామన్నారు. అపార సామర్థ్యం గల ‘గో-ఫస్ట్‌’ టేకోవర్‌ చేసుకోవడంతో రెండు సంస్థలకు లబ్ధి చేకూరునుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గో-ఫస్ట్‌’కు విలువైన బ్రాండ్‌ ప్రయాణికులు ఉన్నారన్నారు. కార్పొరేట్‌ దివాలా చట్టం ప్రక్రియ పూర్తి చేయడానికి గో-ఫస్ట్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ మరో 60 రోజుల సమయం ఇచ్చింది. తమ సంస్థను టేకోవర్‌ చేసేందుకు మూడు సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయని ఎన్‌సిఎల్‌టికి గోఫస్ట్‌ వెల్లడించింది. గోఫస్ట్‌ బ్యాంకుల నుంచి రూ.6,251 కోట్ల అప్పులు తీసుకొని చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో దివాలా ప్రక్రియకు వెళ్లడంతో గతేడాది మేలో తన విమాన సేవలను రద్దు చేసుకుంది.