
హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో రెండు రోజుల పాటు నిర్వహించే సమాచార హక్కు చట్టం రాష్ట్ర స్థాయి సెమినార్ వర్క్ షాపుకు మొగుళ్లపల్లి,మండల ఎల్లారెడ్డి పల్లెకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త, చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ కి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఈనెల నిర్వహించే “PROACTIVE DISCLOUSER OF INFORMATION UNDER RTI ACT” అనే వర్క్స్ షాపు లో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆర్టిఐ,ఆక్ట్వీస్ట్ లకు నిర్వహించే సెమినార్ లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ జనరల్ పంపిన లేఖలో పేర్కొన్నారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డి పల్లె,గ్రామంనుండి చర్లపల్లి,వెంకటేశ్వర్లు గౌడ్,కి రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపు సెమినార్ కు ఆహ్వానం అందడం పట్ల పలువురు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.