శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మన్

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని పెద్దగూడెం గ్రామం లో శ్రీశ్రీ శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి నాల్గవ వార్షిక బ్రహ్మోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్  పాండురంగారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై శివాలయం లో వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం దేవాలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, హాలియ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్,పిట్టల శంకర్,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,వినయ్ రెడ్డి, పాతనబోయిన సురేష్,గజ్జల నాగార్జున రెడ్డి, సతీష్,ఉడుతూరి శ్యాంసుందర్ రెడ్డి, చామల రామకృష్ణారెడ్డి, బ్రహ్మం,అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, ఇస్రం లింగస్వామి,మల్లిఖార్జున చారి,సక్కు,డాక్టర్ శామ్ రెడ్డి లింగారెడ్డి, చెన్ను కోటిరెడ్డి, మాజీ సర్పంచులు కూన్ రెడ్డి మల్లారెడ్డి,దయాల లక్ష్మి పవన్,అచ్చిరెడ్డి,సుబ్బారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చందా నాగిరెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి, ఉడుతరి నారాయణ రెడ్డి, వెంకటయ్య, పోశం కోటిరెడ్డి, దేవాలయ ధర్మకర్త గుర్రం శంకర్ నాగలక్ష్మి, కూన్ రెడ్డి రాంరెడ్డి, నడ్డి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.