
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు అబాకస్ లో సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జిల్లా స్థాయిలో అబాకస్ పరీక్షలో ఆరాధ్య హేమంత్ శిరీష్ శ్రీ నిత హరిణి శ్రేష్ట శబరిష్ జిల్లా స్థాయిలో ఎంపికైనట్టు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాస్ లు శనివారం తెలిపారు .ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో లో డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో హేమంత్ సిరీస్ స్టేట్ లెవెల్ లో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థి హేమన్ శిరీష్ స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషకరంగా ఉందని వ్యక్తం చేశారు సృజన మేడం మాట్లాడుతూ విద్యార్థులు 5 నిమిషాల్లో 50 లెక్కలు ధారాళంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని తమ విద్యార్థి హేమంత్ శిరీష్ స్టేట్ లెవెల్ లో వెళ్లడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో అబాకస్ టీచర్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.