
– వేలాదిగా తరలివచ్చిన జన సమూహం
– కడచూపు కొరకు కదలి వచ్చిన సహచర ఉద్యోగస్తులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందినడి.టీ.యప్. జిల్లా కార్యదర్శి ,ఆర్ రాజన్న ఆకస్మిక మృతి చెందాడు.అశేష జనల మధ్య అంతక్రియలు ముగిసీనవి. తాను నమ్ముకున్న సిద్ధాంతాం కొరకు అలుపెరుగని పోరాటం స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, కడు, చివరి వరకు కూడా సమాజాహితము కొరకు, పని చేసిన జిల్లా డిటిఎఫ్ కార్యదర్శి ఆర్ రాజన్న అనీ, అతని ఆకస్మిక మృతి, ఉపాధ్యాయ సంఘాల కు,సహచర్లకు మరియు సమాజానికి తీరనిలోటని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి, రాజా గంగారాం మరియు ప్రజాపంధ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మరియు ఎఐకేయంయస్. జిల్లా కార్యదర్శి బి దేవారం, డిటిఎఫ్, రాష్ట్ర కార్యదర్శి, మరియు రాష్ట్ర కార్యవర్గ సిబ్బంది, పలువురు అంతిమయాత్రలో పాల్గొని అతని సేవలను గుర్తు చేసుకుంటూ పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ స్మరించుకున్నారు. సమా సమాజ స్థాపన ,కులరహిత సమాజం కొరకు మరియు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరము పోరాడేవారని వారు గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజాన్ని మేలుకొలిపే దిశగా ఎల్లప్పుడూ పాటు పడుతుండే వారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ యొక్క అంతిమయాత్ర కార్యక్రమంలో, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి మరియు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ రాజ గంగారం, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, డి.టి.యప్, జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్, వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారి డాక్టర్ అశోక్, బీజేపీ పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పి. తిరుపతిరెడ్డి, జక్రాన్ పల్లి మండలం విద్య అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్, జంగం అశోక్, అంకం నరేష్ మరియు సహచర ఉద్యోగస్తులు , పాల్గొన్నారు.