
ఈనెల 19న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి భువనగిరి పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రానున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయలింగ స్వామి మాదిగ శనివారం విలేకరులకు తెలిపారు. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకోవడంతో మాదిగ బిడ్డలందరూ పాల్గొనాలని లింగస్వామి అన్నారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని బోయ లింగస్వామి మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.