నవతెలంగాణ – రెంజల్
మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలను పురస్కరించుకొని రెంజల్ మండలంలో అంతర్గత మార్కుల పరిశీలనకే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఆదర్శ పాఠశాల, తాడి బిలోలి జిల్లా పరిషత్ లో తన బృందం అంతర్గత మార్కులన జాబితాలను పరిశీలించడం జరిగిందన్నారు. మండలంలో మొత్తం పది జిల్లా పరిషత్ పాఠశాలలకు బృందాలను ఏర్పాటు చేసి పరిశీలన చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. బృందంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, పిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, బి వెంకటలక్ష్మిలు రాగా, స్థానిక ప్రధాన ఉపాధ్యాయురాలు రేఖ, ప్రిన్సిపల్ బలరాం, చెన్నప్ప, జైనుల్, రాజేందర్ సింగ్, సునీల్, మైత్రేయ, అనంత స్వామి, రవీందర్, నర్సింగ్ రావు, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.