గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి: ఎంపీడీఓ ఏ రవీందర్

నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఎలాంటి లోటూ లేకుండా చూసుకోవాలని, విధులు, గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, వచ్చే వేసవిలో తాగునీటి కి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ రవీందర్ సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీ లలో ఉన్న వసతుల గురించీ పంచాయతీ కార్యదర్శిలకు అడిగి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి కూలీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అంకితభావంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చుడాలని వివరించారు.గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి వసతుల తదితర అంశాలపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలోఏపిఓ సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నిట్టు కిషన్ రావు, కవిత, దివ్య, నరేష్, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.