రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని పార్లమెంటు తొలగించలేదు

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాజ్యాంగ ప్రచార ఐక్య వేదిక ప్రణాళికలో భాగంగా శనివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి బాలికల గురుకుల పాఠశాలలో మాట్లాడుతూ  సెక్యులరిజం, ఫెడరలిజం జుడీషియల్ రివ్యూ అనేవి రాజ్యాంగ మౌలిక అంశాలని, దానిని పార్లమెంటు తొలగించటానికి వీలు లేదన్నారు. 1976 లో సుప్రీంకోర్టు కేశవానంద భారతి మరియు కేరళ కేసులో ఈ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని వివరించారు.మతాన్ని రాజకీయలలోనికి తీసుకు రాకుండా ఉండటమే సెక్యులరిజం అని, దానికి తూట్లు పొడిచే విధంగా దేశాధినేతలు మతపర మైన విషయాలలో పాల్గొనటం సెక్యులరిజం ను వెక్కిరించట మేనని అన్నారు. బర్దిపూర్ సహకార సొసైటీ చైర్మన్ కొసరాజు రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగంతో లెజిస్లేచర్, ఎక్స్ క్లుజివ్ జుడిషియర్, స్వతంత్ర విభాగాలని పేర్కొన్నారు. మండల కన్వీనర్ తలారి సాయన్న, మాట్లాడుతూ మనుధర్మం అందరికి చదువు వద్దంట. రాజ్యాంగం అందరకి చదువు కావాలని చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వనిత, అద్యపాకులు, విద్యార్ధాలు పాల్గొన్నారు.