
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన కేక్‌ను కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, దరియాపూర్ సర్పంచ్ గాదం స్రవంతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గన్నారు