– గురుకుల కార్యదర్శితో జేఏసీ చర్చలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన పోస్టింగ్‌లు ఇవ్వటానికి ముందే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఎస్‌డబ్ల్యూ, టీటీడబ్ల్యూ సంస్థల కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. గురుకుల జేఏసీ నేతలు మామిడి నారాయణ, మధుసూదన్, నర్సింహులుగౌడ్, గణేష్ , బిక్షం యాదవ్ శనివారం జరిగిన చర్చల్లో ఆమె ఈ మేరకు హామీనిచ్చారు. గురుకులాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వకుండా నూతనంగా అపాయింట్‌మెంట్ పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వటం వల్ల సీనియర్లు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ అభిప్రాయంతో సంస్థ కార్యదర్శి ఏకీభవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్ని అడ్డంకులను తొలగిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.