
– ముస్తాబైన అమ్మవార్ల గద్దెలు
– భక్తుల కోసం ఏర్పాట్లను చేస్తున్న నిర్వాహకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
గిరిజన తల్లుల సమ్మక్క,సారలమ్మ జాతర సమీపిస్తుంది.ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనుంది.ఇప్పటికే పల్లె,పట్టణం అనే తేడా లేకుండా భక్తులు ఎత్తు బెల్లం మొక్కు చెల్లించేందుకు సమ్మక్క మేడారం వెల్లుతుండడంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
పోదాం దుబ్బజాతర: మండలంలోని దుబ్బపేట శివారు, చిన్నతూoడ్ల గ్రామం పంట పొలాల్లో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలు దుబ్బు జాతరకు ముస్తామయ్యాయి. ఎండోమేంట్ నుంచి మంజురైన నిధులతో సెంట్రల్ లైటింగ్, అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్లాట్ పారమ్,విద్యుత్,తాగునీరు,తదితర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడ అవాoచనియా సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేయనున్నారు.
దుబ్బజాతర చరిత్ర: రెండు వందల సంవత్సరాలుగా కాకతీయుల సుమారు రెండు వందల సంవత్సరాలుగా జాతరను చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన గౌడ కులానికి చెందిన వారు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఆలయానికి చైర్మన్ గా కోట లక్ష్మయ్య గౌడ్ ఉన్నారు.ఆయన నేతృత్వంలో అమ్మవార్ల గద్దెలు రంగురుగులతో ముస్తాబయ్యాయి. సందర్శకులకు మంచినీటి, మరుగుదొడ్లు, స్నానపు గట్లు తదితర సౌకర్యాలు ఎండోమెంట్ నుంచి మంజూరైన నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి మూడేళ్లకొక్కసారి మేడారం మహజాతర ఉత్సవాలు పురస్కరించుకుని దుబ్బ జాతర ఉత్సవాలు నిర్వహించునట్లుగా తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు జాతర వేడుకలు ఘనంగా నిర్వహించునట్లుగా నిర్వాహకులు, చైర్మన్ లక్ష్మయ్య తెలిపారు. ఈ జాతర ఉత్సవాలకు మండలంలోని తాడిచెర్ల, చిన్నతూoడ్ల,పెద్దతూండ్ల, మల్లారం,కొయ్యుర్ గ్రామాల నుంచే కాకుండా భూపాలపల్లి, కాటారం పట్టణాల నుంచి వేలాదిమంది సందర్శకులు తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.