
– వ్యవసాయ కార్మికులకు “కూలీ బంధు” రూపొందించాలి – జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నిరంతర ఉద్యమాలతో నే కార్మికుల,శ్రామికుల,కర్షకుల కు వారి కష్టాల నుండి విముక్తి కలుగుతుందని అందుకోసం అమరజీవి కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు స్పూర్తితో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ఉదృతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం అశ్వారావుపేట లో కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు 4 వ వర్థంతి సభ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అద్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేదగిరి శ్రీనివాసరావు నిరంతరం పేదల సంక్షేమం కోసం,వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణం కోసం కృషి చేశాడని అన్నారు. ఆయన మరణం సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య లు మాట్లాడుతూ ఆచరణ కమ్యూనిస్టు గా ఆదర్శ ప్రజాప్రతినిధిగా, సంఘం జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీల్లో వివిధ భాద్యతలు సమర్దవంతంగా నిర్వహించారని కొనియాడారు.ఆయన స్పూర్తితో ప్రజా ఉద్యమాలు ఉదృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు అనంతరం సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు అద్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కూలి బందు ఇస్తానని చెప్పిన హామీ అమలు చేయాలని కోరారు. దేశం లో బిజెపి అతి ప్రమాదకరమైన కార్పోరేట్ ప్రభుత్వం గా రుజువయింది న్నారు.దేశ సంపదను కార్పొరేట్ల తో కలిసి లూటీ చేస్తున్నారని విమర్శించారు. రైతులు,కార్మికులు,సామాన్య ప్రజల పై అనేక రకాల భారాలు మోపుతున్నారు అని,శత కోటీశ్వరుల కు మినహాయింపులు,ఇస్తూ పేదలు మరింత పేదలు గా మారే విధంగా వ్యవహరిస్తున్న బిజెపి కి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వ్యవసాయ కార్మికుల కు సమగ్ర శాసనం చేయాలని డిమాండ్ చేశారు.పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య,జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు,సహాయ కార్యదర్శులు శెట్టి వినోద,గడ్డం స్వామి,జిల్లా కమిటీ సభ్యులు సుగుణ,బందెల చంటి,మోకాళ్ళ రమేష్,రావుజ,రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.