మండలంలో కనుమరుగవుతున్న స్వచ్ఛభారత్ రిక్షాలు

నవతెలంగాణ – రెంజల్
గ్రామాల అభివృద్ధి కోసం చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డ్ కు తరలించడానికి అప్పటి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి స్వచ్ఛభారత్ రిక్షాలను పంపిణీ చేయగా నేడు అవి కనుమరుగయ్యాయి. ఇటీవలే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీలను కేటాయించడంతో పార్టీరిక్షాలు నేడు కనబడకుండా పోయాయి. కొన్ని గ్రామపంచాయతీలలో వాటిని పడి వేయడంతో తుప్పు పట్టాయి. గ్రామపంచాయతీల జనాభాను బట్టి రెండు నుంచి ఆరు వరకు రిక్షాలను కేటాయించగా నేడు అయి పూర్తిగా తుప్పు పట్టిపోయి మూలన పడ్డాయి.