ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలకు కోటపాటికి ఆహ్వానం

నవతెలంగాణ –  ఆర్మూర్
ఈనెల 26 నుండి 29 వరకు  యూఏఈ లోని అబుదాబిలో జరగనున్న 13.వ మంత్రుల స్థాయి సమావేశాలకు ఎన్జీవో  కోటాలో ప్రవాస భారతీయుల హక్కులు ,సంక్షేమ వేదిక, అధ్యక్షులు కోటపాటి నర్సిOహం నాయుడు ప్రతినిధిగా పాల్గొని చర్చలలో  భాగస్వామి కావాలని ఆహ్వానం అందింది.ఈ సందర్భంగా ఆదివారం కోటపాటి మాట్లాడుత..భారతదేశంతో సహా 164 సభ్య దేశాల వాణిజ్య మంత్రులు ,వివిధ రంగాల ఆర్థిక నిపుణులు ఈ సమావేశాలలో పాల్గొని 4 రోజులపాటు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య సహకారం ,ఎదురయ్యే సమస్యలపై కులంకాశంగా చర్చించనున్నారు. భారతదేశంలోని ఎన్జీవో ,రైతు సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానించిన, కోటపాటిని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుని హోదా లో ఆహ్వానించడం విశేషం, తెలంగాణ నుండి కోటపాటితో పాటు కర్ణాటక నుండి కె శాంత కుమార్ , కేరళ నుండి కె.వి బిజ్జు లతో కలిసి ఈనెల 24వ తేదీన బయలుదేరి అబుదాబికి వెళ్లనున్నట్టు తెలిపారు. కోటపాటి నరసింహ నాయుడు గత మూడు శతాబ్దాలుగా స్వదేశీ ఆందోళన ఉద్యమకారుని హోదాలో ఈ ఆహ్వానం అందినది,  సదస్సుకు తెలంగాణ నుండి ఒక్కరినే  ఆర్మూర్ వాసిని ఎంచుకోవడం విశేషం.ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందుతున్న భారత్ చేరడం వలన మన దేశంలోని చిన్న పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు కుటీర పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, అని కోటపాటి తెలిపారు.