
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ కు ఆదివారం ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి ఆదివారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ విద్యార్థి సంఘం కొప్పుల రవి మాట్లాడుతూ మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ గారిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అరెo లచ్చు పటేల్ ని మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియమించిన పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు సీతక్క కి ఆదివారం విద్యార్థి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సీతక్క అరెo లచ్చు పటేల్ నాయకత్వంలో మేడారం జాతర సజావుగా జరగాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఆదివాసీల అన్ని ఇల వేల్పులకు సంబంధించిన అన్ని జాతరలు వారిద్దరి నాయకత్వంలో నిర్వహించాలని అరెo లచ్చు పటేల్ గారిని కోరారు. అందుకు పటేల్ గారు స్పందిస్తూ మంత్రివర్యులు సీతక్క గారి నాయకత్వంలో భవిష్యత్ కాలంలో అన్ని ఇల వేల్పుల జాతరలు ఘనంగా నిర్వహిస్తామని లచ్చు పటేల్ గారు హామీ ఇచ్చారు. మేడారం జాతరకు ఫిబ్రవరి 21, 22, 23 తేదీలలో 24 తేదీలలో నాలుగు రోజులు సెలవు ప్రకటించే విధంగా సీతక్క గారితో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.