
– ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో బతుకమ్మ తిప్పే సమీపంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య స్మారక స్థూపాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డితో కలిసి ఆదివారం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన పోరాటం చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచిన వేములవాడ పట్టణానికి చెందిన మహా నాయకుడు గుమ్మి పుల్లయ్య స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు ఆయన ఆలోచన విధానం పోరాటపటిమా ఈ స్థూపాన్ని చూసినప్పుడు ఒక స్ఫూర్తిగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడవడానికి, ఒక చిహ్నంగా ఉంటుందన్నారు. గుమ్మి పుల్లయ్య పేద ప్రజల హక్కుల కోసం,అణగారిన వర్గాల కోసం పోరాటం చేస్తే, వారి కుమారులు సామాజిక దృక్పథంతో,కరోనా సమయంలో వారు చేసిన సేవలను కొనియాడారు.అనంతరం సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు ఇక్కడి ప్రాంతంలో అణిచివేయబడుతున్న పేద ప్రజల కోసం,వారి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు,గుమ్మి పుల్లయ్య ఆలోచనలు ముందుకు తీసుకెళ్తు పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు,గుమ్మి పుల్లయ్య వారసులు గుమ్మి పవన్, మధు మహేష్, సురేఖ, వంశీకృష్ణ, వేములవాడ పట్టణ కార్యదర్శి తెల్ల దేవరాజ్ ,గాజుల పోశెట్టి, శీలం నర్సయ్య ,పంతం రవి, జిల్లా నాయకులు వేణు, పెంట మల్లయ్య, కోరి క్రాంతి, కుమ్మరి కొమురయ్య, శీలం నర్సయ్య, చక్రపాణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పాత సత్యలక్ష్మి ,కాంగ్రెస్, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.