హరిత ప్రేమికుడి వినూత్న కానుక…

– వేడుకకు హాజరైన అతిథులకు గులాబి మొక్కలు పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట : లోకో భిన్న రుచి అన్నారు మన పూర్వీకులు. పరులు పట్ల ప్రేమను కనబరచడం పలు విధాలు.వీటికి తగ్గట్టుగా పర్యావరణ ప్రేమికుడు తన నూతన గృహప్రవేశానికి వచ్చిన సుమారు వెయ్యికి పైగా హాజరు అయిన అతిథులకు గులాబి మొక్కలు అందజేసారు. సాధారణంగా స్టీల్ లేక ప్లాస్టిక్ బాక్స్ లు కానుకగా ఇవ్వడం పరిపాటి.కానీ దీనికి భిన్నంగా పూలమొక్కలు పంపిణీ చేసిన వైనం చర్చాంశనీయం అయింది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల కెమిలాయిడ్స్ పరిశ్రమలో ఉద్యోగి దండు శ్రీనివాసరాజు – సంధ్య దంపతులు గురువారం గృహప్రవేశం వేడుకతో పాటు వారి సుకుమారుడు జ్ఞాన శివ సాయి వర్మ పంచెకట్టు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ప్రతీ ఒక్కరికి చక్కని విందు తో పాటు గులాబీ మొక్క అందజేసి అతిథులను అబ్బుర పరిచారు.