శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’.స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్’ పాటని ఎంఎం కీరవాణీ లాంచ్ చేశారు. హీరో సుహాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. దర్శకుడు విజరు కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ‘శివ ట్రాప్ ట్రాన్స్’ ఈ సినిమా ఆల్బంలో నా ఫేవరేట్. సినిమాలో చాలా కీలక సమయంలో ఈ పాట వస్తుంది. విజువల్‌తో ట్రాక్ వినప్పుడు అన్ బిలివబుల్ అనిపించింది. ఇలాంటి ట్రాక్ దొరకడం ఆనందంగా ఉంది. శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్, కాలభైరవ పాడిన తీరు పాటని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. మా ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట కూడా నచ్చుతుంది. ఈ రెండు నచ్చాయంటే మా సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఈ పాట కోసం శ్రీ చరణ్ ఇచ్చిన ట్యూన్, చైతన్య ప్రసాద్ అల్లిన పదాలు గూస్ బంప్స్ తెప్పించాయి. రావణాసురుడు శివుడుని ఎంత తీవ్రతతో పూజించారో ఇందులో మా విలన్ పాత్ర కూడా ఆ స్థాయిలో ఉంటుంది. ఖచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని దర్శకుడు పురుషోత్తం రాజ్ చెప్పారు. నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్ మాట్లాడుతూ, ‘ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. అందరికీ అద్భుతంగా నచ్చుతుంది’ అని అన్నారు.