60 వేల కానిస్టేబుల్‌ పోస్టులకు 50 లక్షల మంది దరఖాస్తు

60 thousand for constable posts 50 lakh people applied– యూపీలో తాండవిస్తున్న నిరుద్యోగం
– సన్నీలియోన్‌కు అడ్మిట్‌ కార్డు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. 60,244 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏకంగా 50,14,924 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 35 లక్షల మంది పురుషులు, 15 లక్షల మంది మహిళలు ఉన్నారు.రిజర్వేషన్‌ విధానం ప్రకారం మహిళా అభ్యర్థులకు 20 శాతం పోస్టులు ఉన్నాయి. 12,049 మంది మహిళలు ఉద్యోగాలు పొందనున్నారు. అంటే ఒక ఉద్యోగానికి 124 మంది పోటీ పడుతున్నారు. 49,195 మంది పురుషులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక ఉద్యోగానికి 73 మంది పోటీ పడుతున్నారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… యూపీపీఆర్‌పీబీ ఆధ్వర్యాన యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ – 2024 పరీక్షలను 75 జిల్లాల్లోని 2,385 కేంద్రాల్లో శని, ఆదివారాల్లో నాలుగు షిఫ్టుల్లో నిర్వహించారు. దరఖాస్తుదారుల్లో ఆరు లక్షల మందికిపైగా ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. బీహార్‌ 2,67,305, హర్యానా 74,769, జార్ఖండ్‌ 17,112, మధ్యప్రదేశ్‌ 98,400, ఢిల్లీ 42,259, రాజస్థాన్‌ 97,277, ఉత్తరాఖండ్‌ 14,627, పశ్చిమ బెంగాల్‌ 5,512, పంజాబ్‌ 3404, మహారాష్ట్ర 3,151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 22 జిల్లాలకు చెందిన 120 మందిని పరీక్ష రాసేటప్పుడు అక్రమాలకు పాల్పడినందుకు అరెస్టు చేశారు.