మేయర్ ను కలిసిన అదనపు మున్సిపల్ కమిషనర్ శంకర్ 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా బదిలీపై వచ్చిన శంకర్ నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ను సోమవారం మర్యాదపూర్వకంగా నగర మేయర్ క్యాంప్ కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్ బాధ్యతలుగా స్వీకరించిన శంకరును ఎప్పటికప్పుడు నిజామాబాద్ ప్రజలకు గల సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.