మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంథని నియోజకవర్గ అభివృద్ధికి రూ.33 కోట్లు మంజూరు చేయగా అందులో భాగంగా మంథని  మండలానికి రూ.8కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా సోమవారం  మంథని అంబేద్కర్ చౌరస్తా లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆద్వార్యంలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. ఈ సందర్భంగా ఐలి ప్రసాద్, పెంటరిరాజు ,మంథని సత్యం మాట్లాడారు. జననేత శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, మంథని మండలానికి దాదాపు రూ.8 కోట్లు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. మంథనిలో మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ధ్యేయంగా దుద్దిళ్ల ముందుకు వెళ్తుతున్నారని, నిధుల మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.