
ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో గల ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ పరిసరాల నందు నిలిచి ఉంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో డిఆర్డిఏ పిడి కి వింత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్, ఆనంద నిలయం, వికలాంగుల సంక్షేమ హాస్టల్, ఎస్సీ స్కూల్ హాస్టల్ ఓకే పరిసర ప్రాంతాల్లో కలవు, అయితే గత 45 రోజుల నుండి డ్రైనేజీ సంబంధించి చెత్త అంతా హాస్టల్ ప్రాంగణంలో పేరుకుపోయి ఉండడం, దుర్వాసన రావడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత హాస్టల్ వార్డెన్స్ కి ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించారే తప్ప పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. అలాగే లీక్ అవుతున్న డ్రైనేజీ వల్ల విద్యార్థులకు తరచు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల హాస్టల్ విద్యార్థులందరితో రాస్తారోకో కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు మారుతి తదితరులు పాల్గొన్నారు.