భారతీయ గ్రాడ్యుయేట్లు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది

– మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, భారతీయ గ్రాడ్యుయేట్లు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్న  ఇండియా ఇంక్ యొక్క L&D లీడర్స్
– ఉపాధిని మెరుగుపరచగల భాషా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి  కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ & అసెస్‌మెంట్‌తో చేతులు కలిపిన  ఇండియా ఇంక్,  అకాడెమియా నుండి నిర్ణయాధికారులు
నవతెలంగాణ – హైదరాబాద్:
ఉత్సాహపూరితమైన ఉద్యోగ  మార్కెట్‌లో విజయానికి భాషా నైపుణ్యం చాలా ముఖ్యమైనది. ఉద్యోగార్ధులు భారతదేశం తో పాటుగా విదేశాలలోని ఎంఎన్ సి లలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నందున, ఉద్యోగ నియామక నిర్ణయాలలో సంస్థలకు మంచి భాషా నైపుణ్యాలు తప్పనిసరి అవుతున్నాయి. CUP&A ఇటీవల  నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, విభిన్న విభాగాల నుంచి కీలకవ్యక్తుల  భాగస్వామ్యాన్ని చూసింది, ఉద్యోగాలను పొందటానికి సాంకేతిక నైపుణ్యాలతో పాటు  మెరుగైన భాషా నైపుణ్యాల ఆవశ్యకత,  పరిశ్రమ అవసరంగా వెల్లడించింది. కార్పొరేట్లు, అత్యుత్తమ ప్రతిభ కోసం వారి అన్వేషణలో, విద్యాపరమైన నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా,  విభిన్న నైపుణ్యాలకు   గణనీయమైన ప్రాధాన్యతనిస్తున్నారు. అయినప్పటికీ,  భాషా నైపుణ్యం వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు.  ఈ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాషా ప్రావీణ్య లీడర్ CUP&A,  విద్యా సంస్థలు మరియు భావి యజమానులతో భాగస్వామ్యానికి కట్టుబడి పాఠ్యాంశాల మెరుగుదల, పరిశ్రమల సహకారాలు మరియు అనుభవపూర్వక అభ్యాస అవకాశాల ద్వారా భాషా నైపుణ్యంలో అంతరాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. కేంబ్రిడ్జ్ రెండు లింగ్వాస్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది . అవి  తెలంగాణ నుండి JB ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి G పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాగా తెలంగాణ నుండి ముగ్గురు కేంబ్రిడ్జ్ లెర్నింగ్ భాగస్వాములు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ నుంచి రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ మరియు KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వున్నాయి. ఇవి గాక  హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీతో  లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది. కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ప్రాంతీయ డైరెక్టర్ అరుణ్ TK, మాట్లాడుతూ.. నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి,  అగ్రశ్రేణి ఎంప్లాయర్లతో  కనెక్ట్ కావడానికి,  కేంబ్రిడ్జ్ రూపొందించిన ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడానికి మేము  కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తున్నాము ” అని అన్నారు.
ప్రపంచ స్థాయికి గ్రాడ్యుయేట్‌లను తీర్చిదిద్దడం, గ్రాడ్యుయేట్‌లు భవిష్యత్ కార్యాలయంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు  సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవాలనే నిబద్ధతకు అనుగుణంగా,  CUP&A సంస్థ ఇటీవల హైదరాబాద్‌లో ఇండస్ట్రీ-అకాడెమియా కనెక్ట్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది.  “ఇన్నోవేట్, లీడ్, సక్సీడ్ : కొత్త పని యుగంలో కార్పొరేట్ అంచనాలు” అనే నేపథ్యం తో జరిగిన ఈ ఈవెంట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో తాజా టాలెంట్‌లను రిక్రూట్ చేయడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి కార్పొరేట్ సంస్థలు మరియు ఉన్నత విద్యా సంస్థల నుండి కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చింది.  దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థల నుండి వైస్ ఛాన్సలర్‌లు, రిజిస్ట్రార్లు, డీన్స్,  ప్లేస్‌మెంట్ డైరెక్టర్లు వంటి వారు దీనిలో పాల్గొన్నారు.