
నవతెలంగాణ – పెద్దవూర
విద్యార్థులు ప్రణాళికా బద్దంగా చదవాలన్నా,ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లక్ష్యాలను నిర్ధేశించుకోవాన్నా తగిన శిక్షణ అవసరం. దీనికి గాను ప్రముఖ ఇంపాక్ట్ పౌండేషన్ పౌండర్ గా గంపా నాగేశ్వర్,ఎగ్స్గ్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇంపాక్ట్ నూనె సుదర్శన్ ఆధ్వర్యంలో మండలం లోని పెద్దగూడెం జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో ఇంగ్లిష్ బోధకుడుమేదరి దేవేందర్ ను ఎంపిక చేశారు. సోమవారం మండలం లోని పెద్దగూడెం ఉన్నత పాఠశాల లోనియామక పత్రాన్ని ఇంపాక్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్బంగా దేవేందర్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో, కళాశాలల్లో,గురుకులాలలో ఉచిత వ్యక్తిత్వ వికాస తరగతులునిర్వహినకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అవసరమైన వారుతనను సంప్రదించాలని కోరారు.970 4126090 నంబర్ ను సంప్రదించి మీ అవగాహన కొరకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థినులలు ఉన్నత శిఖరాలు చేరాలంటే ఎక్కవగా పుస్తక పఠనం, లేఖనం ద్వారా సాధ్యపడుతుందన్నారు. లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని అన్నారు.విద్యార్థినులు చదువుతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణతో పెద్దలను, గురువులను గౌరవించటం ద్వారా మనలో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని అన్నారు. సెల్‌ఫోన్‌ను దైనందన జీవితంలో తక్కువగా ఉపయోగించాలని, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని చెప్పారు.